Heavy Rains : నేడు కూడా భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అలెర్ట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది
రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశముందని తెలిపింది. ఇరవై తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నిన్న కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. కుండపోత వర్షంతో నగరవాసులు ఇబ్బంది పడ్డారు. తెలంగాణలో 29 జిల్లాల్లో ప్రజలు అలెర్ట్ గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపిది. ప్రధానంగా మెదక్, మల్కాజ్గిరి, భువనిగిరి, ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూలు, జగిత్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, కొమురం భీం, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, భువనగిరి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భాారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.