Mon Dec 23 2024 02:34:04 GMT+0000 (Coordinated Universal Time)
భయ్యా .. మళ్లీ ఇక్కడా గెలిపించావుగా?
యూపీలో బీజేపీ గెలుపునకు ప్రధాన కారణం ఎంఐఎం అన్నది వాస్తవం. ముస్లిం ఓటు బ్యాంకును చీల్చడంలో ఎంఐఎం సక్సెస్ అయింది
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఊహించిందే. తొలి నుంచి అనుకుంటున్నట్లు బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 274 స్థానాల్లో ముందజలో ఉంది. బీజేపీకి గతంలో కంటే స్థానాలు తగ్గినా ఈ గెలుపునకు ప్రధాన కారణం ఎంఐఎం అన్నది వాస్తవం. ముస్లిం ఓటు బ్యాంకును చీల్చడంలో ఎంఐఎం సక్సెస్ అయింది. తాను సొంతంగా పెద్దగా సీట్లను గెలుచుకోలేకపోయినా, పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడింది.
102 స్థానాల్లో....
ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 102 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసింది. ఇక్కడ ప్రధానంగా సమాజ్ వాదీ పార్టీకి పడాల్సిన ముస్లిం ఓట్లు తన సొంతం చేసుకుంది. ఈ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గతంలో బీహార్ లో జరిగిన ఎన్నికల్లోనూ ఎంఐఎం ఐదు స్థానాలు గెలుచుకుని ఆర్జేడీ కూటమి ఓటమికి కారణమయింది. ఇప్పుడు అదే తరహాలో యూపీలోనూ అసదుద్దీన్ ఒవైసీ పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చారు. ఒవైసీ కాన్వాయ్ పై యూపీలో జరిగిన కాల్పుల వ్యవహారం కూడా ఓట్ల చీలికకు కారణమని చెబుతున్నారు.
బీహార్ తరహాలోనే...
పశ్చిమ బెంగాల్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఎంఐఎం ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రం ఓట్లను భారీగానే చీల్చిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. చిన్నా చితకా పార్టీలను కలుపుకుని పోటీ చేసిన ఎంఐఎం యూపీ ఎన్నికల్లో మాత్రం సమాజ్ వాదీ పార్టీని బాగానే దెబ్బతీసింది. బీజేపీ బలంగా ఉంటేనే ఎంఐఎం బలోపేతమవుతుందని ఒవైసీ నమ్ముతున్నట్లుంది. అందుకే ఆయన అనేక రాష్ట్రాల్లో పోటీ చేసి బీజేపీయేతర పార్టీలను దెబ్బతిస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
- Tags
- mim
- uttarpradesh
Next Story