Mon Jan 13 2025 08:48:04 GMT+0000 (Coordinated Universal Time)
అక్బరుద్దీన్ సెన్సేషనల్ కామెంట్స్
ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎవరైనా తమ మాట వినాల్సిందేనని, తమ ముందు తల వంచాల్సిందేనని స్పష్టం చేశారు. ఎంఐఎం ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి కేసీఆర్ వరకూ ముఖ్యమంత్రి ఎవరైనా తమకు గొడుగు పట్టాల్సిందేనని, పట్టారని స్పష్టం చేశారు. డిసెంబర్ 11న తమ పవర్ ఎంటో ప్రపంచానికి చూపిస్తామన్నారు. తాము తలుచుకుంటేనే ఎవరినైనా సీఎం పీఠంపై కూర్చోబెడతామన్నారు. తాను రాజకీయ నేతను కాదని... రాజునని అని పేర్కొన్నారు. ఎన్నికల వేళ అక్బర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల కూడా ఆయన ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినప్పుడు... తెలంగాణలో తాము ముఖ్యమంత్రి ఎందుకు కాలేమని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story