Thu Jan 16 2025 11:11:45 GMT+0000 (Coordinated Universal Time)
సమాధానం చెప్పాకే పాదయాత్ర చేయాలి
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... కోడి కత్తి దాడిపై పోలీసులకు జగన్ ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ చెబుతున్నారంటే ఆయనకు ఏపీలో తిరిగే అర్హత లేదని పేర్కొన్నారు.
ఏపీ పోలీసులనే అవమానిస్తారా...?
నిష్పక్షపాతంగా పనిచేస్తున్న వ్యవస్థను జగన్ అవమానిస్తున్నారని అన్నారు. గాయపడిన వ్యక్తి కనీసం విచారణకు సహకరించకుండా విమానం ఎందుకు ఎక్కి వెళ్లాడని, దాడి చేసిన కత్తి సీఐఎస్ఎఫ్ పోలీసుల చేతిలోకి కాకుండా వైసీపీ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు. నరేంద్ర మోదీ మాట... వై.ఎస్.జగన్ బాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Next Story