కేఈ కొంచెం కూడా..?
రోడ్డుపైన ఏదైనా ప్రమాదం జరిగితే ఆపి ఆరా తీస్తాం. ఆంబులెన్సుకు ఫోన్ చేస్తాం. అవసరమైతే బాధితులను ఆసుపత్రికి తరలిస్తాం. ధైర్యం చెబుతాం. కానీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. కర్నూలు నుంచి సి.బెళగల్ మండలంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కేఈ కృష్ణమూర్తి బయలుదేరారు. మార్గమధ్యలో సి.బెళగల్ మండలం పొలకల్ గ్రామంలో ఆడుకుంటున్న దిలీప్(7) అనే బాలుడిని మంత్రుల కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో బాలుడు తీవ్రగాయాల పాలయ్యాడు. అయినా, ఆగకుండా కాన్వాయ్ వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాధ్యతగల మంత్రి స్థానంలో ఉండి ఓ బాలుడికి ప్రమాదం జరిగితే కనీసం పట్టనట్లు వెళ్లిపోవడంపై కృష్ణమూర్తిపై విమర్శలు వస్తున్నాయి.