Mon Dec 23 2024 18:35:07 GMT+0000 (Coordinated Universal Time)
పుడింగి అన్నావుగా... చేసి చూపించారుగా
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం మున్సిపాలిటీని గెలిపించి జగన్ కు గిప్ట్ గా ఇచ్చారు.
వ్యూహాలు వర్క్ అవుట్ అయ్యాయి. కార్యాచరణ కట్టుదిట్టంగా అమలయింది. ఫలితం దుమ్ము రేపే విధంగా వచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా కుప్పంలో చంద్రబాబు కూసాలు కదిలిపోవడానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పక తప్పదు. ఆయన తొలి నుంచి కుప్పంపైనే దృష్టి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గిన నాటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ పాగా వేయాలని ప్రయత్నించారు. చివరకు సక్సెస్ అయ్యారు.
పుడింగి అంటూ...
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలవంతుడని తెలుసు. ఆయన అన్ని రకాలుగా వ్యూహాలు పన్నగలడని తెలుసు. అందుకే జగన్ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబుకు కూడా తొలి నుంచి పెద్దిరెడ్డి అంటేనే భయం. అందుకే ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడల్లా పెద్దిరెడ్డినే టార్గెట్ చేసేవారు. పెద్దిరెడ్డి ఏమైనా పుడింగా? అని చంద్రబాబు ఎద్దేవా కూడా చేశారు. తన ఇలాకాలో ఎలాగెలుస్తారో చూస్తానంటూ జబ్బలు చరిచారు.
పెద్దిరెడ్డి టార్గెట్ గా...
ఇక నారా లోకేష్ కూడా పెద్దిరెడ్డి మీదనే పరోక్షంగా విమర్శలు చేశారు. కుక్కలంటూ మాట జారారు. అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంయమనంతో వ్యవహరించారు. కుక్కలు అన్నావు సరే.. లెక్కలు చూద్దు గానివంటూ ఆయన ఖచ్చితంగా చేసి చూపించారు. కుప్పంలో చంద్రబాబు కోలుకోకుండా చేశారు. ఇప్పటికే పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెండాను పాతి చంద్రబాబును నిస్సహాయుడిని చేశారు.
ఫ్యామిలీ మొత్తం కుప్పంలోనే..?
గత రెండు నెలల నుంచి పెద్దిరెడ్డి ఫ్యామిలీ కుప్పంలోనే కూర్చుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిధున్ రెడ్డి, సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాధ రెడ్డిని అక్కడే ఉంచారు. బాబాయ్, అబ్బాయిలిద్దరూ కుప్పంను సెట్ చేశారు. చంద్రబాబు, లోకేష్ రెండు రోజుల పాటు పర్యటించి వెళ్లినా పెద్ది రెడ్డి వ్యూహాలు మాత్రమే అక్కడ ఫలించాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కు వరస గిఫ్ట్ లు ఇస్తున్నారు. దటీజ్ పెద్దిరెడ్డి.
Next Story