Mon Dec 23 2024 13:18:55 GMT+0000 (Coordinated Universal Time)
మీడియాకు మంత్రి పేర్నినాని వీడ్కోలు విందు
ఈ విందుకు మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పేర్నినాని మాట్లాడుతూ.. ఊపిరి ఉన్నంతవరకూ
తాడేపల్లి : ఏపీ మంత్రులు నేడు తమ పదవులకు రాజీనామాలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ నేతృత్వంలో కేబినెట్ భేటీ ప్రారంభమయింది. 24 మంది మంత్రులు ఖాళీ లెటర్ హెడ్ పేపర్లతో కేబినెట్ భేటీకి హాజరయ్యారు. కొత్తమంత్రి వర్గం ఏప్రిల్ 11న కొలువుదీరనుంది. అంతుకుముందు మంత్రిగా ఆఖరిరోజున పేర్నినాని మీడియా మిత్రులకు వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు.
ఈ విందుకు మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పేర్నినాని మాట్లాడుతూ.. ఊపిరి ఉన్నంతవరకూ మీడియాను గుర్తుంచుకుంటానని తెలిపారు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఈ మూడేళ్లలో మీడియా మిత్రులందరినీ పేరుతో పిలిచేంత దగ్గరయ్యానని చెప్పుకొచ్చారు. తనకు మంత్రిగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చిన సీఎం జగన్ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని చెప్పారు.
Next Story