హత్యాయత్నం వెనక పెద్ద రాజకీయ కుట్ర
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై మంత్రి కాల్వ శ్రీనివాసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘ సమావేశం తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడుతూ... జగన్ పై దాడి జరగగానే ఢిల్లీలో ఉన్న గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడగడం, వెంటనే కేంద్రమంత్రి స్పందించడం ఏంటని ప్రశ్నించారు. హత్యాయత్నం తర్వాత జరిగిన పరిణామాలను చూస్తే దీని వెనక రాజకీయా కుట్ర ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీసుకు రావడానికి పైస్థాయిలో కుట్ర జరుగుతుందన్నారు. ఆపరేషన్ కుట్రలో బాగమయ్యే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. దాడి జరగగానే బీజేపీ నాయకులు, కేసీఆర్, కేటీఆర్ వెంటనే స్పందించడాన్ని కూడా ఆయన విమర్శించారు. దాడిని అడ్డు పెట్టుకుని శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ పై దాడి చేసిన వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.