Wed Jan 15 2025 06:24:24 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సభలో కంటతడి పెట్టిన ఎమ్మెల్యే
తాను పార్టీ మారాలని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వైసీపీకి దూరం కాలేదని విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. మంగళవారం కురుపాంలో జరిగిన బహిరంగ సభలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తాను వైఎస్సార్ పచ్చబొట్టు వేయించుకున్నానని, తన కట్టె కాలే వరకు వైఎస్ఆర్ కుటుంబాన్ని విడిచివెళ్లనని పేర్కొన్నారు. అనంతరం జగన్ మాట్లాడుతూ... 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్న పరిస్థితుల్లో చిన్నవారైనా తన సోదరి పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజు ప్రలోభాలకు లొంగకుండా విలువలతో కూడిన రాజకీయం చేశారని పేర్కొన్నారు. వీరిద్దరికీ తన మనస్సులో ఎప్పటికీ చోటు ఉంటుందని అన్నారు. దీంతో పుష్కశ్రీవాణి సభలోనే భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
Next Story