గ్రామీ అవార్డుకు ప్రధాని మోదీ పాట
ప్రధాని మోదీ స్వయంగా కలం, గళం కలిపిన ఓ పాట ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుకు నామినేట్ అయింది. ఆర్నెళ్ల నెలల కిందట విడుదలైన ‘అబండన్స్ ఇన్ మిలెట్స్’ (తృణధాన్యాలలో అత్యుత్తమ పోషకాలు) అనే పాట 2024 గ్రామీ అవార్డుకు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్పార్మెన్స్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది.
ప్రధాని మోదీ స్వయంగా కలం, గళం కలిపిన ఓ పాట ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుకు నామినేట్ అయింది. ఆర్నెళ్ల కిందట విడుదలైన ‘అబండన్స్ ఇన్ మిలెట్స్’ (తృణధాన్యాలలో అత్యుత్తమ పోషకాలు) అనే పాట 2024 గ్రామీ అవార్డుకు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్పార్మెన్స్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది.
ఈ పాటను ఫాల్గుణి షా, గౌరవ్ షా అనే భార్యభర్తలు రచించగా, ప్రధాని మోదీ కూడా రచనా సహకారం అందించారు. తృణధాన్యాల విలువను తెలియజేస్తూ రూపొందించిన ఈ పాటకు కొటేషన్ల రూపంలో మోదీ తన వంతు సాయం అందించారు. ‘తృణధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం’ సందర్భంగా ఈ గీతాన్ని స్వరపరిచారు. ఈ ఏడాది ప్రదమార్థంలో ఫల్గుణి, గౌరవ్ జంట మోదీని కలిసినప్పుడు, దేశంలో ఆహార ధాన్యాల కొరత గురించి వారి మధ్య చర్చ జరిగింది. ప్రధాన ఆహార పంటలకు ప్రత్యామ్నాయంగా తృణ ధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించాలని, దీనికోసం ఓ పాటను రూపొందించాలని ప్రధాని ఈ గాయక జంటకు సూచించారు.
గతంలో మోదీ కొన్ని పాటలు రాశారు. ఈ పాట విషయంలో కూడా తమకు సహకరించాలని వారు మోదీని అభ్యర్థించారు. దీనికి ప్రధాని కూడా సరే అంటూ, కొటేషన్స్ రాయడమే కాకుండా, వాటిని స్వయంగా పాట మధ్యలో ప్రస్తావించారు. అందమైన వీడియో కూడా ఈ పాటకు తోడవడంతో, యూట్యూబ్లో పాపులర్ అయింది. 2024 గ్రామీ అవార్డుకు ఈ పాట నామినేట్ కావడం విశేషం.