Tue Dec 03 2024 19:03:51 GMT+0000 (Coordinated Universal Time)
అగ్రరాజ్యం.. అయినా మనదే రాజ్యం
అమెరికా మహిళల అండర్ 19 తొలి జట్టులో అత్యధిక మంది భారతీయ మూలాలున్న వారే.
అమెరికా మహిళల అండర్ 19 తొలి జట్టులో అత్యధిక మంది భారతీయ మూలాలున్న వారే. అమెరికాలో క్రికెట్ పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. అన్నింటా అగ్రరాజ్యం అని పించుకున్న అమెరికా మాత్రం క్రికెట్ ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. 2010లో తొలిసారి అండర్ 19 పురుషుల జట్టు తొలిసారి ప్రపంచ కప్ లో ఆడింది. రెండు దశాబ్దాల తర్వాత మహిళల జట్టును ప్రపంచ కప్ కు ఆ దేశం ఎంపిక చేసింది.
బాలికల జట్టులో...
అయితే జట్టులో పదిహేను మందిని ఎంపిక చేయగా సింహభాగం ఆసియా దేశాలకు చెందిన వారే కావడం గమనార్హం. అందులోనూ భారతీయులు, తెలుగువారు ఎక్కువగా కనపడుతున్నారు. ఆసియా దేశాల్లో క్రికెట్ కున్న మక్కువకు, ఆదరణకు ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో దక్షిణాఫ్రిికాలో మహిళల అండర్ 19 జట్టు ప్రపంచ కప్ జరగనుంది ఈ పోటీలో అమెరికా కూడా పాల్గొంటుంది. అమెరికా జట్టు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం.
నెటిజన్ల సెటైర్లు...
యూఎస్ ఐసీసీలో సభ్య దేశంగా ఉంది. ఇక ప్రపంచ కప్ నెలరోజులు ఉందనగానే జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో ఆసియా దేశాలకు చెందిన వారే అధికంగా ఉన్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. పురుషుల జట్టు మాదిరిగానే మహిళల జట్టు కూడా ఆసియా దేశాల మూలాలున్న వారితోనే నిండిపోయింది. దీనిపై ఒక నెటిజన్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా స్వ్కాడ్ కాదని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటూ కామెంట్ చేశారు. మరొకరు ఇది ఇండియాకు చెందిన మరొక టీం అంటూ ఛలోక్తి విసిరారు. మొత్తం మీద అనేక మంది క్రికెట్ లో అమెరికా దుస్థితి పట్ల కొందరు అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేస్తుండటం విశేషం.
Next Story