Thu Dec 26 2024 01:13:29 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ గెలుపుతో ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరింది
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంబరాల్లో మునిగిపోయారు. ఇవాళ [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంబరాల్లో మునిగిపోయారు. ఇవాళ [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంబరాల్లో మునిగిపోయారు. ఇవాళ ఆయన అనుచరులతో కలిసి హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ కు నివాళులర్పించారు. ఆయన అనుచరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఇవాళ చంద్రబాబు దారుణంగా ఓడిపోవడంతో ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరిందని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు మంచి రోజులు వచ్చాయన్నారు.
Next Story