మురళీ మోహన్ కు ఊరట
జయభేరి ఛైర్మన్ మురళీమోహన్, కుటుంబసభ్యులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. స్థలం తీసుకుని మోసగించారని మురళీమోహన్‌పై భూ యజమాని సీఐడీకి [more]
జయభేరి ఛైర్మన్ మురళీమోహన్, కుటుంబసభ్యులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. స్థలం తీసుకుని మోసగించారని మురళీమోహన్‌పై భూ యజమాని సీఐడీకి [more]
జయభేరి ఛైర్మన్ మురళీమోహన్, కుటుంబసభ్యులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. స్థలం తీసుకుని మోసగించారని మురళీమోహన్‌పై భూ యజమాని సీఐడీకి ఫిర్యాదు చేశారు. భూ యజమాని ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి 41ఏ సెక్షన్ కింద నోటీసు ఇచ్చి రేపు విచారణకు రావాలని పేర్కొంది. దీంతో హైకోర్టులో మురళీమోహన్, కుటుంబసభ్యులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మురళీమోహన్ తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చారని పేర్కొన్నారు. జయభేరీ ప్రాపర్టీస్ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు. దీంతో కేసులో అన్ని రకాల చర్యలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.