Wed Nov 06 2024 01:46:41 GMT+0000 (Coordinated Universal Time)
మస్క్ మామ కొత్తప్రయోగం న్యూరాలింక్.. వర్కవుట్ అవుతుందా ?
ఈ విషయాన్ని మస్కే ప్రకటించారు. ‘‘యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని పత్రాలను..
అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న ఈ ఆధునిక యుగంలో కొత్తకొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఆలోచన రావడం ఆలస్యం..దాన్ని ఆచరణలో పెట్టేస్తున్నారు. తాజాగా ఎలాన్ మస్క్ మరో కొత్త ప్రయోగంతో న్యూరాలింక్ పేరుతో ఓ స్టార్టప్ ను మొదలుపెట్టారు. తమ ప్రయత్నంతో.. వెన్నెముక దెబ్బతిని నడవలేని వారిని కూడా నడిచేలా చేస్తామని చెప్తున్నాడు మస్క్ మామ. మనిషి మెదడులో ఒక చిన్న కాయిన్ పరిమాణంలో ఉండే పరికరాన్ని ఇంప్లాంట్ చేస్తారు. ఆ పరికరం కంప్యూటర్ తో అనుసంధానమై ఉంటుంది. మెదడుకి కంప్యూటర్ కి మధ్య లింక్ ఆ కాయిన్.
దీనివల్ల మనిషి తన మెదడులో ఏది ఆలోచిస్తాడో.. అందుకు అనుగుణంగా కంప్యూర్ కు సంకేతాలు వెళ్తాయి. రానున్న ఆరునెలల్లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. న్యూరాలింక్ తో దీనిని ప్రయోగాత్మకంగా చేసి చూపించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని మస్కే ప్రకటించారు. ''యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని పత్రాలను సమర్పించాం. దాదాపు వచ్చే ఆరు నెలల్లో మొదటి న్యూరాలింక్ ను మనిషి మెదుడులో ప్రవేశపెడతాం. మొదటి మానవ ఇంప్లాంట్ ను సిద్ధం చేసేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ముఖ్యంగా వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్న వారిలో ఈ పరికరంతో పూర్తి స్థాయి శరీర కదలికలను తీసుకురాగలమని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం'' అని మస్క్ కంపెనీ ప్రెజెంటేషన్ సందర్భంగా ప్రకటించారు. మరి ఈ ప్రయోగంలో మస్క్ ఎంతవరకూ విజయం సాధిస్తారో చూడాలి. ఇది సక్సెస్ అయితే మస్క్.. వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణ చేసిన వాడిగా పేరొందుతాడు.
Next Story