‘నారా హమారా’ బాధిత యువకులకు జగన్ హామీ
గుంటూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘నారా హమారా - టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శించి కేసులు, అరెస్టుకు గురైన యువకులు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల జరిగిన సభలో నంద్యాలకు చెందిన 8 మంది ముస్లిం యువకులు ప్రభుత్వం ముస్లింలకు, ముస్లిం నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని చంద్రబాబు ఎదుటే ప్లకార్డులు ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీంతో వీరిని పోలీసులు అరెస్టు చేసి ‘దేశ విభజనకు కుట్ర’ చేశారనే తీవ్రమైన కేసులు నమోదు చేశారు.
ఆరు నెలలే... అదైర్యపడొద్దు..
దీంతో ఈ యువకులు విశాఖపట్నం జిల్లా సబ్బవరం సమీపంలో జగన్ ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే, అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఈ అబద్ధపు, నిరంకుశ ప్రభుత్వం ఇంకా ఆరు నెలలే ఉంటుందని జగన్ వారికి స్పష్టం చేశారు. ఆరు నెలల తర్వాత తమ ప్రభుత్వం రాగానే వారిపైన కేసులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.