Sun Jan 12 2025 22:33:33 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తమ్ వల్లే పార్టీ మారుతున్నా
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విధానాలు నచ్చకనే కాంగ్రెస్ కి రాజీనామా చేసినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ [more]
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విధానాలు నచ్చకనే కాంగ్రెస్ కి రాజీనామా చేసినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ [more]
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విధానాలు నచ్చకనే కాంగ్రెస్ కి రాజీనామా చేసినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ శంషాబాద్ బహిరంగ సభకు 10 వేల మంది కూడా హాజరుకాలేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరును అర్థం చేసుకోవాలన్నారు. తనకు కోమటిరెడ్డి సోదరులు రాజకీయంగా ఎంతో సహకారం అందించారని తెలిపారు. కానీ తాను ఎవరి ప్రోద్భలంతోనూ పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలోకి వస్తారో రారో తాను చెప్పలేనన్నారు.
Next Story