అక్కడ టీడీపీ టిక్కెట్ ఈయనకే
నిడదవోలు టీడీపీ టిక్కెట్ రేసులో మాజీ జడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పేరు గత వారం రోజులుగా బాగా వినిపిస్తోంది
2024 ఎన్నికలే టార్గెట్గా టీడీపీ అధినేత చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో ఇన్చార్జ్లు లేకుండా ఖాళీగా ఉన్న చోట్ల ఇన్చార్జ్లను భర్తీ చేస్తూ వస్తున్నారు. ఏ స్థానంలో ఎవరు బలమైన అభ్యర్థో కరెక్టుగా వారికే బాధ్యతలు ఇచ్చేలా పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. పార్టీకి బలమైన జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లాలోనే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి దిక్కూ దివాణం లేదు. ఎస్సీ నియోజకవర్గాలు అయిన కొవ్వూరులో టూమెన్ కమిటీ వేశారు. చింతలపూడికి అదీ దిక్కు లేదు. నిడదవోలు ఇన్చార్జ్ నాకు వచ్చే ఎన్నికల్లో సీటే వద్దని చెప్పారు. అక్కడ కొత్త ఇన్చార్జ్ను వేయాల్సి ఉంది. ఇక నరసాపురంలో బలహీన ఇన్చార్జే ఉన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఉండి రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న నిడదవోలు టీడీపీ టిక్కెట్ / ఇన్చార్జ్ రేసులో మాజీ జడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పేరు గత వారం రోజులుగా బాగా వినిపిస్తోంది.