బాలయ్య వెర్సస్ వర్మ ... ఆగదా... ?
కథానాయకుడు, మహానాయకుడు ఎన్టీఆర్ అనే టైటిల్స్ తో బాలకృష్ణ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తో సంక్రాంతికి రంగంలోకి దిగనున్నారు. ఈ రెండు సినిమాలతో బాటు ఫిబ్రవరి లో వైఎస్ బయోపిక్ యాత్ర ప్రేక్షకులముందుకు రాబోతుంది. ఈ నాలుగు సినిమాలపై ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ నడుస్తుంది. ప్రేక్షకుల్లో అయితే అమిత ఆసక్తి నెలకొంది. ఎవరు ఎలా నిర్మించారు ? ఏది నిజం ఏది అబద్ధం. అనే చర్చ సినిమాల రిలీజ్ కి ముందే సాగుతుంది. అటు సోషల్ మీడియా నుంచి సంప్రదాయ మీడియా వరకు ఎక్కడ చూసినా ఈ సినిమాలా ప్రస్తావనే నడుస్తుంది.
హల్ చల్ చేస్తున్న బాలయ్య వార్నింగ్ ఆడియో ...
ఇదిలా ఉంటే బాలకృష్ణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు వార్నింగ్ ఇస్తూ మాట్లాడినట్లు వచ్చిన ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. వాస్తవానికి అది బాలయ్య మాట్లాడింది కాదంటున్నారు. బాలయ్య వాయిస్ ను ఇమిటేట్ చేసి విడుదల చేసింది గా చెబుతున్నారు. అయినప్పటికీ ఆ క్లిప్ వైరల్ అయిపొయింది. మరొక వైపు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పై తాజాగా విడుదల చేసిన కుట్ర కుట్ర అన్న సాంగ్ తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహం పెల్లుబికేలా చేసింది. ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా వర్మ పై కేసులు నమోదు చేశారు తమ్ముళ్లు. వర్మ కూడా ఇలాంటి సంచలనమే కావాలనుకున్నారు. బాలయ్య కోట్లు ఖర్చు పెట్టి ఆడియో రిలీజ్ కార్యక్రమం చేపడితే పైసా ఖర్చు లేకుండా వర్మ అంతకన్నా ఎక్కువ పబ్లిసిటీ నెగిటివ్ గా సాధించారు. ఇలాంటి ఎత్తుగడల్లో వర్మకు సాటి ఎవ్వరు రారన్నది ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే.
సినిమాకు ముందే ఇలా ఉంటే ...
సినిమాకు ముందే ఇలా ఉంటే ఇక కథానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అయిన తరువాత ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలో పెల్లుబికుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో వర్మ సినిమా విడుదలకు అక్కడ టి సర్కార్ ఉండటంతో ఇబ్బంది తలెత్తకపోవొచ్చని అయితే ఎపి లో ఆ చిత్రం విడుదల ఏదో రకంగా ఆగిపోవొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కోర్టు ల ద్వారానే చిత్రం విడుదల జరిగే అవకాశాలు వుంటాయని భావిస్తున్నారు. అయితే ఈ పరిణామాలన్నిటికి వర్మ అండ్ టీం రెడీ గా వుంది. బాలయ్య టీం, తెలుగు తమ్ముళ్లే తమ ప్రచారానికి ఉపయోగపడతారని లెక్కిస్తుంది. సంక్రాంతి చలిలో కోడిపందాలు తరహాలో కథానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ నువ్వా నేనా అని తలపడటం ఖాయం కావడంతో ఏపీలో సినీ పొలిటికల్ హీట్ పెరుగుతుంది