Sun Dec 22 2024 22:39:21 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ టార్గెట్ గా బాలయ్య పంచ్ డైలాగులు
నందమూరి బాలకృష్ణ సినిమాలంటే పంచ్ డైలాగులుంటాయి. తాజా రాజీకీయ పరిణామాలపై ఆయన డైలాగులను సినిమాలోనూ చొప్పిస్తారు
బాలయ్య బాబు సినిమాలంటే పంచ్ డైలాగులుంటాయి. తాజా రాజీకీయ పరిణామాలపై ఆయన డైలాగులను సినిమాలోనూ చొప్పిస్తారు. వీర సింహారెడ్డిలోనూ పంచ్ లతో కూడిన పొలిటికల్ డైలాగులు నిర్వాహకులు పెట్టారు. బాలయ్య రాజకీయ నాయకుడు కావడంతో ఆయనకు ఈ డైలాగులు నప్పుతాయని భావించడమే కాకుండా పార్టీ అభిమానులను కూడా థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసిన ట్రైలర్ లో కూడా ఇదే విషయం మరోసారి రుజువైంది. పాలిటిక్స్ ను మిక్స్ చేసి అధికార పార్టీ టార్గెట్ గా బాలయ్య నోటి నుంచి డైలాగులను వదిలారు.
హెల్త్ యూనివర్సిటీ....
"సంతకం పెడితే బోర్డు మీదనే పేరు మారుతుంది. చరిత్రను సృష్టించిన వారి పేరు మారదు. మార్చలేరు" అన్న డైలాగు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చడంపై ప్రత్యేకంగా బాలయ్య నోట పలికించినట్లుంది. ఇలాంటి డైలాగులు సినిమాలో అనేకం ఉన్నాయి. అధికార వైసీపీని ఉద్దేశించి పంచ్ డైలాగులను బాలయ్య నోట పలికించే ప్రయత్నం చేశారంటున్నారు ఈసినిమాలో. మరి దీంతో పాటు ఇంకెలాంటి డైలాగులు ఉంటాయోనన్న ఆసక్తి ట్రైలర్ తోనే వీరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ అభిమానులను ఆకట్టుకున్నాడనడం అతిశయోక్తి కాదు.
Next Story