Thu Jan 16 2025 03:18:06 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికే...
తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, మామ చంద్రబాబు స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వస్తున్నానని నందమూరి సుహాసిని ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో కూకట్ పల్లి నుంచి మహాకూటమి తరపున బరిలో దిగుతున్నానని, తెలంగాణ ప్రజలు తనను ఆడపడుచులా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తాను చిన్నప్పుడు లక్షల సార్లు ప్రజలే దేశుళ్లు... ప్రజలకు సేవ చేయాలి అనే నినాదం విన్నానని, అప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ముందుకొచ్చానని తెలిపారు. నందమూరి కుటుంబసభ్యులు అందరి ఆమోదంతోనే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన తాత, తండ్రి సేవ చేసినట్లే ప్రజలకు సేవ చేస్తానన్నారు. రేపు కూకట్ పల్లి నుంచి నామినేషన్ వేయనున్నట్లు తలిపారు.
Next Story