Sun Mar 16 2025 12:04:20 GMT+0000 (Coordinated Universal Time)
నా భర్త భోంచేటప్పుడు కూడా
చంద్రబాబు భోంచేసేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించే వారని, ఆయన నిత్యం అమరావతి గురించే మాట్లాడే వారని నారా భువనేశ్వరి తెలిపారు. రైతుల దీక్షలో చంద్రబాబు తో [more]
చంద్రబాబు భోంచేసేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించే వారని, ఆయన నిత్యం అమరావతి గురించే మాట్లాడే వారని నారా భువనేశ్వరి తెలిపారు. రైతుల దీక్షలో చంద్రబాబు తో [more]

చంద్రబాబు భోంచేసేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించే వారని, ఆయన నిత్యం అమరావతి గురించే మాట్లాడే వారని నారా భువనేశ్వరి తెలిపారు. రైతుల దీక్షలో చంద్రబాబు తో పాటు భువనేశ్వరి పాల్గొన్నారు. రాజధాని అమరావతి అంటే చంద్రబాబుకు ఎనలేని ప్రేమ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలన్న తపన నిత్యం తన భర్తలో కన్పిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, అమరావతే చంద్రబాబు ధ్యాస అని భువనేశ్వరి తెలిపారు. తాను రైతుల దీక్షకు మద్దతు తెలుపుతున్నానని, ఈ ఉద్యమం మరింతగా పెరగాలని భువనేశ్వరి ఆకాంక్షించారు. అమరావతిలోనే రాజధాని ఉండేందుకు మరింత ఉద్యమించాలని తెలిపారు.
Next Story