జగన్ కు ఎవరు చెప్పారు?
జగన్ కు జనవరిలో ఎన్నికలు వస్తాయని ఎవరు చెప్పారని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ ఇటీవలే ఒక సర్వే చేయించుకుని తానే ముఖ్యమంత్రినవుతానని ప్రకటించుకుంటున్నారని, అనుభవం లేని జగన్ కు ఎవరు ఓట్లేస్తారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీయే నెంబర్ వన్ గా నిలుస్తుందన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.
లాలూచీ రాజకీయాలతో.....
జగన్ లాలూచీ రాజకీయాలు అందరికీ తెలుసునని, బీజేపీతో కుమ్మక్కై తనపై బాబ్లీ కేసులో నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇప్పించారన్నారు. ప్రజా పోరాటంలో వీటికి తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న చంద్రబాబు రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. విశాఖ రైల్వేజోన్ ఇక కేంద్ర ప్రభుత్వం ఇవ్వదని, పోలవరానికి నిధులు కూడా ఇవ్వదని తనకు తెలుసునన్నారు. తనకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- bobly case
- janasena party
- nara chandrababu naidu
- non bailble warrant
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నాన్ బెయిల్ బుల్ వారెంట్
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- బాబ్లీ కేసు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ