Thu Jan 16 2025 04:59:24 GMT+0000 (Coordinated Universal Time)
బాబు బ్యాక్ డోర్ పాలిటిక్స్
తెలంగాణలో ఏ రాజకీయం చేయలేకనే చంద్రబాబునాయుడు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు కవిత ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే తన ఆటలు సాగుతాయన్నది చంద్రబాబు ఆలోచన అని, అందుకే ఆయన వందల కోట్ల సొమ్మును ఇక్కడకు డంప్ చేస్తున్నారన్నారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థిితిిని చూస్తే జాలేస్తుందన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా చివరకు విజయం కేసీఆర్ దేనని, నాలుగున్నరేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు.
Next Story