బాబు ఆ ఇద్దరికే....ఎందుకంటే....?
ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి మంత్రివర్గవిస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెడీ అయిపోయారు. మరికొద్దిసేపట్లో మంత్రివర్గ విస్తరణపై సీనియర్ నేతలు, మంత్రులతో చర్చించనున్నారు. ఈ విస్తరణలో కేవలం ఇద్దరికి మాత్రమే చోటుంటుందని తెలిసింది. ప్రస్తుతం మండలి ఛైర్మన్ గా ఉన్న ఫరూక్ కు స్థానం కల్పించనున్నారు. అలాగే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్ కు కూడా స్థానం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
వైద్య ఆరోగ్యశాఖ......
రేపు ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు అధికార నివాసంలో ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. అయితే ఈసందర్భంగా కొన్ని శాఖల మార్పులు కూడా చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రధానంగా కామినేని శ్రీనివాస్ రాజీనామా చేసిన తర్వాత కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి తన వద్దనే ఉంచుకున్నారు. ఈ శాఖ సీనియర్లకు అప్పగిస్తారా? లేక ఫరూక్ కు కేటాయిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.
వైసీపీకి నో ఛాన్స్.....
మరోవైపు ఫరూక్ ను మంత్రి వర్గంలో తీసుకుంటే మండలి ఛైర్మన్ పదవిని కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఈ పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కొద్దిసేపట్లో సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చిస్తారు. అలాగే విస్తరణలో మంత్రి పదవిని ఆశించిన వారిని కూడా బుజ్జగించనున్నారు. కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి వచ్చారు. ఆయన మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కానీ గవర్నర్ తో సత్సంబంధాలు లేకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వకూడదని, ఒకవేళ ఇచ్చినా గవర్నర్ కొర్రీలు వేసే ప్రమాదముందని చాంద్ భాషా ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు జాతీయ రాజీకీయాలపై చర్చించడానికి రాహుల్ గాంధీ దూతగా అశోక్ గెహ్లట్ నేడు అమరావతికి రానున్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- ashok gehlet
- bharathiya janatha party
- cabinet expansion
- chand basha
- governer
- indian national congress
- kidari sravan
- nara chandrababu naidu
- nmd farooq
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అశోక్ గెహ్లెట్
- ఆంధ్రప్రదేశ్
- ఎన్.ఎం.డి ఫరూక్
- ఏపీ పాలిటిక్స్
- కిడారి శ్రవణ్
- గవర్నర్
- చాంద్ భాషా
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారతీయ జనతా పార్టీ
- మంత్రి వర్గ విస్తరణ భారత జాతీయ కాంగ్రెస్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ