జగన్ రెడ్డి నిట్టనిలువునా ముంచారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా ముంచుతుందని లోకేష్ అన్నారు. అధికారంలోకి రాగానే 2.30 [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా ముంచుతుందని లోకేష్ అన్నారు. అధికారంలోకి రాగానే 2.30 [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా ముంచుతుందని లోకేష్ అన్నారు. అధికారంలోకి రాగానే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేస్తానని చెప్పిన జగన్ మాట తప్పారన్నారు. ఆశపెట్టి నిరుద్యోగ యువతను జగన్ బలి తీసుకుంటున్నారని నారా లోకేష్ ఆరోపించారు. ఈ రెండేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని లోకేష్ ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా జగన్ లో చలనం లేదన్నారు. కర్నూలు జిల్లాలో నిరుద్యోగి గోపాల్ మృతిని నారా లోకేష్ ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఉదహరించారు.