స్వంత కారు కూడా లేదా..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం చాలా సాధారణంగా మొదలైంది. ఆయన ఒక చాయ్ వాలాగా కూడా పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే, దేశప్రధాని ఆస్తులు ఎన్నో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ప్రధాని కార్యాలయం స్వయంగా మోదీ ఆస్తులను తాజాగా ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం 2018 మార్చి 31 నాటికి నరేంద్ర మోదీ మొత్తం ఆస్తుల విలువ రూ.2.28 కోట్లు అని తెలిసింది.
- ఆయన చేతిలో రూ.48,944 నగదు మాత్రమే ఉంది.
- గాంధీ నగర్ ఎస్బీఐ బ్యాంక్ లో రూ.11,29,690 డబ్బులు నిల్వ ఉన్నాయి.
- అదే బ్రాంచిలో ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇతర డిపాజిట్ స్కీమ్ ల కింద మరో రూ.1.07 కోట్ల పెట్టుబడుతు ఉన్నాయి.
- రూ.5.18 లక్షల విలువ గల జాతీయ పొదుపు బాండ్, రూ.1.59 లక్షల విలువ గల ఎల్ఐసీ పాలసీ ఉంది. రూ.20 వేల ఎల్ ఆండ్ టీ ఇన్ ఫ్రా బాండ్ ఉంది.
- ఆయన వద్ద రూ.1.38 లక్షల విలువ చేసే బంగారం(నాలుగు ఉంగరాలు) ఉన్నాయి.
- మోదీ పేరుపై ఒక్క కారు కూడా లేదు.
- గుజరాత్ గాంధీ నగర్ లో 2002లో రూ.1,30,488తో ఓ భవనంలో నాలుగో వంతు కొనుగోలు చేశారు. ఇప్పుడు దాని విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు.