ఇది అభివృద్ధి బడ్జెట్..!
మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను రూపొందించామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా వేతన జీవులు [more]
మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను రూపొందించామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా వేతన జీవులు [more]
మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను రూపొందించామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా వేతన జీవులు కోరుకుంటున్న ఆదాయ పన్ను పరిమితి పెంపును తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. దేశంలో పేదరికం తగ్గిపోతోందని… పేదలు మధ్య తరగతిలోకి చేరుతున్నారని అన్నారు. రైతుల కోసం తాము అనేక కార్యక్రమాలు తీసుకువచ్చామన్నారు. రైతుల ఖాతాలకే డబ్బులు ఇచ్చే పథకం ఈ బడ్జెట్ లో తీసుకువచ్చామని, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో రైతుల కోసం చేపట్టిన అతి పెద్ద కార్యక్రమం ఇదన్నారు. అసంఘటిత కార్మికుల గురించ ఇప్పటివరకు ఎవరూ ఆలోచించలేదని, వారికి పింఛన్లు ఇవ్వడం ద్వారా 40 కోట్ల మంది లబ్ధి పొందుతారని అన్నారు. ఇవాళటి బడ్జెట్ అభివృద్ధి బడ్జెట్ అని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనన్నారు. మున్ముందు అనేక కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.