బాహుబలిలో భల్లాల… ఆంధ్రలో బాబు ఒకటే
బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి పాత్ర చంద్రబాబు పోషిస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతకైనా తెగిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో [more]
బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి పాత్ర చంద్రబాబు పోషిస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతకైనా తెగిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో [more]
బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి పాత్ర చంద్రబాబు పోషిస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతకైనా తెగిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మోడీ మాట్లాడుతూ… రైతుల బాగు కోసం తాము అధికారంలోకి రాగానే పోలవరానికి జాతీయ హోదా కల్పించామని, కానీ యూటర్న్ బాబుకు, టీడీపీ నేతలకు మాత్రం పోలవరం ప్రాజెక్టు ఒక ఏటీఎంగా మారిందన్నారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ కమీషన్లు పొందుతూ పోలవరం పూర్తి కాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తాము తీసుకొచ్చిన పథకాలకు చంద్రబాబు తన స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటూ స్టిక్కర్ బాబుగా మారారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తోందన్నారు. రెండేళ్ల క్రితం పేపర్లలో చంద్రబాబు మాటలు, ఇప్పటి మాటలు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు.
చంద్రబాబుకు కుటుంబమే ఫస్ట్
ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ కాపాడాలనేది తమ ప్రయత్నమని, చంద్రబాబు ప్రయత్నం మాత్రం ఆయన స్వంత కంపెనీ హెరిటేజ్ ను కాపాడుకోవడమే అన్నారు. ఇండియా ఫస్ట్ అనేది ఏపీ ప్రజల ఆలోచన అయితే, చంద్రబాబుకు మాత్రం ఆయన కుటుంబమే ఫస్ట్ అని పేర్కొన్నారు. సేవామిత్ర యాప్ పేరుతో సేవ చేస్తామని కలెక్ట్ చేసిన ప్రజల డేటాను చోరీ చేశారన్నారు. మన వద్ద నుంచి సేకరిస్తున్న డేటానే దొంగలిస్తున్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారో ఆలోచించుకోవాలని అన్నారు. తీవ్రవాదులను వారి ఇళ్లలోకి వెళ్లి మరీ మట్టుబెడితే ప్రపంచమంతా హర్షిస్తుంటే చంద్రబాబు, మహాకూటమి నేతలు మాత్రం బాధపడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు, జగన్ కు, కాంగ్రెస్ కు దేశంలోని కుటుంబాల గురించి అవసరం లేదని, వారికి వారి కుటుంబాలే ముఖ్యమన్నారు. ఇటువంటి కుటుంబ పార్టీల వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదని, నిజాయితీగా పనిచేసే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో రావాలన్నారు.