ఏప్రిల్ 5న దేశమంతా ఏం చేయాలంటే?
దేశమంతా ఐక్యంగా పోరాడితేనే కరోనా పై విజయం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన దేశప్రజలకు వీడియో సందేశం పంపారు. కరోనాపై యుద్ధం చేస్తున్న వారందరికీ [more]
దేశమంతా ఐక్యంగా పోరాడితేనే కరోనా పై విజయం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన దేశప్రజలకు వీడియో సందేశం పంపారు. కరోనాపై యుద్ధం చేస్తున్న వారందరికీ [more]
దేశమంతా ఐక్యంగా పోరాడితేనే కరోనా పై విజయం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన దేశప్రజలకు వీడియో సందేశం పంపారు. కరోనాపై యుద్ధం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మోదీ. అందరం ఇళ్లల్లోనే ఉండి కొన్ని రోజులుగా కరోనాపై యుద్ధం చేస్తున్నామన్నారు. చాలా దేశాలు మన తరహాలోనే లాక్ డౌన్ ను పాటిస్తున్నాయని మోదీ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే కరోనాపై యుద్ధం చేసినట్లేనని తెలిపారు. వచ్చే ఆదివారం ఏప్రిల్ 5వ తేదీన 130 కోట్ల మంది ప్రజలు రాత్రి 9గంటలకు ప్రతి ఇంట్లో అందరూ ఇళ్లల్లో విద్యుత్తు దీపాలు ఆపేయాలన్నారు. తొమ్మిది నిమిషాలు విద్యుత్ దీపాలు ఆపివేయాలని కోరారు. కొవ్వుత్తులు, దీపం, మొబైల్ ఫ్లాష్ లైట్లతో సంఘీభావం ప్రకటించాలన్నారు. దీంతో కరోనా చీకట్లను తరిమివేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఎవరు ఎక్కడ ఉన్నా లైట్లు ఆర్పివేయాలన్నారు. దేశ ప్రజల సంకల్ప శక్తిని వెలిగించాలన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని మోదీ ధన్యవాదాలు తెలిపారు. స్వీయ నిర్భంధంలో ఉన్నా మనం ఒంటరి కాదని నిరూపించాలని కోరారు.