రాజధాని రైతుల ఉద్యమాన్ని తప్పు పట్టకూడదు
రాజధాని అమరావతిపై పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కామెంట్స్ సంచలనం కల్గిస్తున్నాయి. అమరావతి రాజధాని మార్పు పై ఆ ప్రాంత రైతులకు ఆందోళన కలగడం సహజమని రఘురామకృష్ణంరాజు [more]
రాజధాని అమరావతిపై పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కామెంట్స్ సంచలనం కల్గిస్తున్నాయి. అమరావతి రాజధాని మార్పు పై ఆ ప్రాంత రైతులకు ఆందోళన కలగడం సహజమని రఘురామకృష్ణంరాజు [more]
రాజధాని అమరావతిపై పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కామెంట్స్ సంచలనం కల్గిస్తున్నాయి. అమరావతి రాజధాని మార్పు పై ఆ ప్రాంత రైతులకు ఆందోళన కలగడం సహజమని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. వారి ఆందోళనను తప్పు పట్టడం న్యాయం కాదన్నారు. అమరావతి నుంచి రాజధాని పూర్తిగా తరలించడం లేదని దానితో పాటు విశాఖ కూడా రాజధానిగా ఉంటుంది అని చెబుతున్నార్నారు. అమరావతి రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తన అభిప్రాయమన్నారు. ఇంకా రాజధాని పై పూర్తిగా క్లారిటి రాలేదన్నారు రఘురామ కృష్ణంరాజు. క్యాబినెట్ లో ఆమోదం, అసెంబ్లీ లో ఆమోదం జరిగితే కానీ రాజధాని మార్పు పై స్పష్టత రాదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిందని, దానితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. అమరావతి అభివృద్ధి ఏ మాత్రం తగ్గదని తెలిపారు.