వైఎస్ జగన్ తో ఇద్దరు దూతల మంతనాలు..?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లోక్ సభ స్థానాలు సాధిస్తారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆయన మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లోక్ సభ స్థానాలు సాధిస్తారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆయన మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లోక్ సభ స్థానాలు సాధిస్తారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆయన మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తున్న జగన్ ను బీజేపీయేతర కూటమిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే, ఇప్పటికే జగన్ కు ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ తో ఉన్నందున లోలోన జగన్ ను మచ్చిక చేసుకునే పనిలో ఆ పార్టీ ఉందని తెలుస్తోంది.
పవార్ ఫోన్ లో….
ఇందులో భాగంగా కాంగ్రెస్ కీలక నేత నిన్న జగన్ తో ఫోన్ లో మాట్లాడి మద్దతు కోరినట్లు సమాచారం. ఇక, ఎన్సీపీ నేత శరద్ పవార్ సైతం జగన్ తో మాట్లాడారని విశ్వసనీయ సమాచారం. వీరిరువురూ ఎన్డీయేతర కూటమికి మద్దతు ఇవ్వాలని జగన్ ను కోరారు. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాతే తన మద్దతు ఎవరికో చెబుతానని జగన్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.