Sat Nov 23 2024 02:54:22 GMT+0000 (Coordinated Universal Time)
"నవీన్" నీకు సాటి ఎవరు?
అభివృద్ధి పనుల కోసం చివరకు తన తండ్రి బిజూ పట్నాయక్ సమాధినే తొలగించి నవీన్ పట్నాయక్ ప్రజల ముఖ్యమంత్రిగా నిలిచారు
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు దఫాలుగా వరసగా ఆయన విజయాలే ఆయన పనితీరును తెలియచేస్తున్నాయి. ఒడిశా భాష రాకపోయినా ఆయననే తమ ముఖ్యమంత్రిగా జనం కోరుకుంటున్నారు. మరే పార్టీకి గత కొన్ని దశాబ్దాలుగా ఒడిశా ప్రజలు అవకాశం ఇవ్వడం లేదు. బ్రహ్మచారిగా ఉన్న నవీన్ పట్నాయక్ ఆలోచించేదంతా పేద ప్రజల గురించే. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో మరోసారి నవీన్ పట్నాయక్ అంటే చెప్పకనే తెలుస్తుంది.
తండ్రి సమాధిని...
అభివృద్ధి పనుల కోసం చివరకు తన తండ్రి బిజూ పట్నాయక్ సమాధినే తొలగించి ఆయన ప్రజల ముఖ్యమంత్రిగా నిలిచారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. పూరిలోని శ్మశానవాటికలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండటంతో బిజూ పట్నాయక్ సమాధి అడ్డంకిగా మారింది. దీంతో అధికారులు కొంత సంశయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నవీన్ పట్నాయక్ అక్కడి నుంచి సమాధిని తొలగించాలని ఆదేశించి అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి కోసం...
ఈ విషయాన్ని నవీన్ ప్రయివేటు కార్యదర్శి వీకే పాండ్యన్ చెబితేగాని ప్రపంచానికి తెలియరాలేదు. అంత రహస్యంగా ఉంచారు ఆయన. చాలా రోజుల క్రితం ఈ ఘటన జరిగినా ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన ఒడిశా దివస్లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అందుకే నవీన్ ను ఒడిశా ప్రజలు అంత ఇష్టపడుతున్నారు. 2019లో ఈ ఘటన జరిగిందని తెలిపారు. దీంతో నవీన్ జనం మనస్సుల్లో మరింత ఎదిగిపోయారు.
Next Story