Mon Dec 23 2024 20:21:04 GMT+0000 (Coordinated Universal Time)
భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. నష్టం తప్పదా ?
కానీ ఈ గ్రహశకలం పయనించే వేగం ప్రమాదకరంగా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ గ్రహశకలం గంటకు 49,513 కిలోమీటర్ల వేగంతో భూమి..
అమెరికా : అంతరిక్షంలో జరిగే ప్రమాదాల కారణంగా.. కొన్ని గ్రహశకలాలు అప్పుడప్పుడూ భూమివైపుకు దూసుకొస్తుంటాయి. చాలా సందర్భాల్లో ఇలా భూమివైపు దూసుకొచ్చిన గ్రహశకలాలు సముద్రాల్లో పడటంతో ప్రమాదాలు తప్పాయి. తాజాగా మరో గ్రహశకలం భూమివైపుకు దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. ఈ గ్రహశకలం 450 మీటర్ల వెడల్పు ఉందని, మిగిలిన గ్రహశకలాలతో పోల్చితే.. దీని సైజు కాస్త చిన్నదేనని తెలిపింది.
కానీ ఈ గ్రహశకలం పయనించే వేగం ప్రమాదకరంగా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ గ్రహశకలం గంటకు 49,513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని తెలిపారు. ఇది భూమ్మీద పడితే భారీ నష్టం తప్పదని శాస్త్రవేత్తల అంచనా. తాజాగా, పొటెన్షియల్లీ హజార్డస్ గ్రహశకలాల జాబితాలో నాసా చేర్చింది. ఆస్టరాయిడ్ 2013బీవో76 అని పిలిచే ఈ గ్రహశకలం.. ఈసారి భూమికి 51 ,11,759 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోతుందని, భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపబోదని సైంటిస్టులు చెబుతున్నమాట. ఈ రోజే ఆ గ్రహశకలం భూమిని దాటేస్తుందని ఓ అంచనా ఉంది. గతంలోనూ ఈ ఆస్టరాయిడా భూమివైపు దూసుకురాగా.. ఈసారి మాత్రం మరింత దగ్గరగా వస్తుందట. 2033 జులై 14న మరోసారి ఇది భూమి దగ్గరకు వస్తుందనే అంచనాలున్నాయి.
Next Story