కోయంబేడు నెల్లూరు కొంపముంచేటట్లే ఉంది
నెల్లూరు జిల్లాకు కోయంబేడు మార్కెట్ సెగ తాకింది. నెల్లూరు జిల్లాలో గత కొంతకాలంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని భావిస్తున్న సమయంలో ఒక్కరోజే ఐదు కేసులు నమోదయ్యాయి. [more]
నెల్లూరు జిల్లాకు కోయంబేడు మార్కెట్ సెగ తాకింది. నెల్లూరు జిల్లాలో గత కొంతకాలంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని భావిస్తున్న సమయంలో ఒక్కరోజే ఐదు కేసులు నమోదయ్యాయి. [more]
నెల్లూరు జిల్లాకు కోయంబేడు మార్కెట్ సెగ తాకింది. నెల్లూరు జిల్లాలో గత కొంతకాలంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని భావిస్తున్న సమయంలో ఒక్కరోజే ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి వ్యాప్తి చెందినవేనని అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లా నుంచి ప్రతి రోజూ చెన్నై కోయంబేడు మార్కెట్ కు కూరగాయలను తీసుకెళ్తారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లాకు తీసుకువస్తారు. కోయంబేడు మార్కెట్ లో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందడంతో అక్కడికి వెళ్లి వచ్చిన వారికి కూడా కరోనా సోకింది. దీంతో కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి వారికి పరీక్షలు జరిపి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకూ 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.