Mon Dec 23 2024 20:16:07 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి షాక్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజధాని అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజధాని అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. వారివద్దకు వెళ్లి ఎమ్మెల్యే బాగోగులను కనుక్కోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ని ఎస్ఎస్బీ కల్యాణ మండపంలో రైతులు బస చేశారు. భారీ వర్షాల కారణంగా మహా పాదయాత్రకు రైతులు బ్రేక్ ఇచ్చారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా వారి వద్దకు వెళ్లి బాగోగలను కనుక్కోవడం విశేషం.
వారి బాగోగులను....
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల కాన్సెప్ట్ ను వదిలిపెట్టలేదు. మొన్న మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నా, కొత్త బిల్లును ప్రవేశపెడతామని స్వయంగా జగన్ అసెంబ్లీలో చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజధాని రైతుల వద్దకు వెళ్లి మాట్లాడటమ ే కాకుండా, వారికి ఏ అవసరమొచ్చినా తానున్నానని చెప్పడం పార్టీలో చర్చనీయాంశమైంది.
Next Story