Mon Dec 23 2024 15:43:35 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నమెంట్‌కు కోటంరెడ్డి రిటర్న్ గిఫ్ట్
నెల్లూరూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.
నెల్లూరూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. నిన్న ఆయకు ఉన్న గన్మెన్లను ప్రభుత్వ తొలగించిన సంగతి తెలిసిందే. 2 + 2 ఉన్న గన్ మెన్లను 1 + 1 గా మార్చింది. అయితే కోటంరెడ్డి మాత్రం తాను ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన తన వద్ద ఉన్న ఇద్దరు గన్మెన్లను కూడా తనకు వద్దని చెప్పారు. ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
గన్మెన్లు ఇద్దరినీ...
తనకు ఉన్న ఇద్దరు గన్మెన్లను వెనక్కు పంపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్ని చేసినా తన గళం ఆగదని ఆయన అన్నారు. గన్మెన్లను తొలగించినంత మాత్రాన భయపడేది లేదన్నారు. తన భద్రత తగ్గించి మానసికంగా భయపెట్టాలని చూస్తున్నారన్నారు. కానీ దేనికీ భయపేడిది లేదన్నారు. నాకు కార్యకర్తలే రక్షణగా ఉంటారన్నారు. ఎందాకైనా సిద్ధంగా ఉన్నానని, తగ్గేదేలేదని కోటంరెడ్డి ప్రభుత్వంపై ఫైరయ్యారు.
Next Story