Mon Dec 23 2024 19:53:04 GMT+0000 (Coordinated Universal Time)
నేపాల్ విమానం మిస్సింగ్ విషాదాంతం.. నదివద్ద కూలిపోయిన విమానం
నేపాల్ లో 22 మందితో ప్రయాణిస్తున్న విమానం ఆదివారం ఉదయం మిస్సైన విషయం తెలిసిందే. తారా ఎయిర్కు చెందిన..
నేపాల్ లో 22 మందితో ప్రయాణిస్తున్న విమానం ఆదివారం ఉదయం మిస్సైన విషయం తెలిసిందే. తారా ఎయిర్కు చెందిన విమానానికి 9:55 నిమిషాల సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. పోఖారాలో టేకాఫ్ తీసుకున్న 15 నిమిషాల తర్వాత విమానం సిగ్నల్స్ అందకపోవడంతో.. దాని ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. నేపాల్ ఆర్మీకూడా రంగంలోకి దిగి విమానం కోసం గాలించింది.
కానీ.. ఆఖరికి విషాదమే మిగిలింది. కోవాంగ్ గ్రామం సమీపంలో లామ్చే నది వద్ద విమానం కూలిపోయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ.. ఘటనా స్థలానికి బయల్దేరింది. విమానంలో 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది కలిపి మొత్తం 22 మంది ఉన్నారు. వారిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story