Tue Nov 05 2024 10:50:27 GMT+0000 (Coordinated Universal Time)
విమానం మిస్సింగ్.. భారతీయులు కూడా
ఆదివారం ఉదయం పర్యాటక నగరమైన పోఖారా నుంచి టేకాఫ్ అయిన తర్వాత తారా ఎయిర్‌కు చెందిన ట్విన్ ఓటర్ 9N-AET విమానం ఎగిరిన
నేపాల్‌లో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆదివారం ఉదయం నేపాల్‌లోని పోఖారా నుంచి జామ్సన్ వెళ్తున్న తారా ఎయిర్‌కు చెందిన విమానానికి 9:55 నిమిషాల సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ మీడియా తెలిపింది. ముస్తాంగ్ జిల్లాలోని జామ్సన్ గగనతలంలో విమానం చివరిసారిగా కనిపించిందని, ఆ తర్వాత దౌలగిరి పర్వతం వైపు మళ్లిందని తెలిపారు. ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని నేపాల్ అధికారులు చెప్పుకొచ్చారు. విమానంలో ముగ్గురు సిబ్బందితో పాటు, మరో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. గల్లంతైన విమానం కోసం రెండు ప్రైవేటు హెలికాప్టర్ల ద్వారా గాలింపు జరుపుతున్నారు. నేపాల్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.
ఆదివారం ఉదయం పర్యాటక నగరమైన పోఖారా నుంచి టేకాఫ్ అయిన తర్వాత తారా ఎయిర్‌కు చెందిన ట్విన్ ఓటర్ 9N-AET విమానం ఎగిరిన 15 నిమిషాల తర్వాత టవర్‌తో సంబంధాలు కోల్పోయినట్లు తారా ఎయిర్ ప్రతినిధి తెలిపారు. ముగ్గురు సభ్యుల నేపాలీ సిబ్బందితో పాటు నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు , 13 మంది నేపాలీ ప్రయాణికులు ఉన్నారని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు.
విమానంలోని ముగ్గురు సభ్యుల సిబ్బందికి కెప్టెన్ ప్రభాకర్ ప్రసాద్ ఘిమిరే నాయకత్వం వహించారు. విమానం పశ్చిమ పర్వత ప్రాంతంలోని జోమ్సోమ్ విమానాశ్రయంలో ఉదయం 10:15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. పోఖారా-జోమ్సోమ్ ఎయిర్ రూట్లో ఘోరేపానీ పైన ఆకాశం నుంచి టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని విమానయాన వర్గాలు తెలిపాయి. జోమ్సోమ్ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ప్రకారం జోమ్సోమ్లోని ఘాసాలో పెద్ద శబ్దం వచ్చిందనే కథనాలు కూడా ఉన్నాయి. విమానం ధౌలగిరి ప్రాంతంలో కూలిపోయిందని అనుమానిస్తున్నట్లు మై రిపబ్లికా వార్తాపత్రిక ముస్తాంగ్ డీఎస్పీ రామ్ కుమార్ డానీ తెలిపారు. విమానం కోసం వెతకడానికి జోమ్సోమ్ నుండి హెలికాప్టర్ వెళ్లినట్లు డాని చెప్పారు.
Next Story