బ్రేకింగ్ : తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త కమిటీలు
తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీలను నియమించింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ను నియమించింది. మరో తొమ్మిది కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. 15 మందితో కోర్ కమిటీ, 53మందితో కోఆర్డినేషన్ కమిటీ, 41 మందితో ఎన్నికల కమిటీలను నియమించారు. కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ గా ఆర్.సి.కుంతియా, కన్వీనర్ గాఉత్తమ్ కుమార్ రెడ్డి, మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహ్మ, కోఛైర్మన్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్లుగా మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, వైస్ ఛైర్ పర్సన్ గా డీకే అరుణ, కన్వీనర్ గా దాసోజు శ్రవణ్, స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతరావు, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా కోదండరెడ్డిలను నియమించారు. ఇక ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని ఎలక్షన్, క్యాంపెయిన్, మ్యానిఫెస్టో కమిటీల్లో వేయడం గమనార్హం. ఈ కమిటీలను ఢిల్లీలో ఏఐసీసీ ప్రతినిధి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.