Thu Dec 19 2024 22:38:32 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచ వాయుకాలుష్య నగరాల జాబితా.. టాప్ 20లో తొలి రెండు నగరాలు భారత్ కు చెందినవే
టెక్నాలజీ, డెవలప్ మెంట్ అంటూ మానవుడు ఈ కంప్యూటర్ యుగంలో క్షణంతీరిక లేకుండా పరుగులు పెడుతున్నాడు. ఈ క్రమంలో..
మోటార్ సైకిళ్లు, కార్లు వంటి పొల్యూటెడ్ వాహనాలు లేని రోజుల్లోప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మోటార్ సైకిల్ లేనివారంటూ లేరు. 85 శాతం మందికి పెట్రోల్, డీజిల్ లతో నడిచే వాహనాలున్నాయి. ఫలితంగా కాలుష్యం పెరిగి.. లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. తాజాగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ (HEI) స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలో అత్యధికంగా పొల్యూట్ అవుతున్న టాప్ 20 నగరాల్లో భారత్ కు చెందిన మూడు నగరాలు ఉన్నాయి. ఈ విషయం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మరో విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్కతా నగరాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 14వ స్థానంలో ముంబై నగరం ఉంది.
టెక్నాలజీ, డెవలప్ మెంట్ అంటూ మానవుడు ఈ కంప్యూటర్ యుగంలో క్షణంతీరిక లేకుండా పరుగులు పెడుతున్నాడు. ఈ క్రమంలో మనం వాడుతున్న కార్లు, బైక్ లు, లారీలు, బస్సులు ఇలా అనేక వాహనాల వల్ల కాలుష్యశాతం పెరిగిపోతోంది. PM 2.5 సంబంధిత కారకాలతో అనారోగ్యం భారిన పడిన వారిలో.. బీజింగ్ లో 1,00,000 మందికి 124 మరణిస్తుండగా, ఢిల్లీలో 106 మరణాలు, కోల్ కతాలో 99 మరణాలు సంభవిస్తున్నాయి. అత్యధికంగా కలుషితమైన నగరాల జాబితాలో చైనాకు చెందిన ఐదు నగరాలు టాప్ 20లో ఉన్నాయి.
కాగా.. NO2 సగటు విస్తరణ జాబితాలో షాంఘై అగ్రస్థానంలో ఉండగా.. ఈ జాబితాలో ఏ భారతీయ నగరం లేదు. చాలా నగరాలు డబ్ల్యూహెచ్ఓ సూచించిన ప్రమాణాలను అతిక్రమించాయని నివేదిక తెలిపింది. 2019లో నివేదికలో చేర్చబడిన 7,000 నగరాల్లో 86% కాలుష్య కారకాలకు గురికావడం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాన్ని మించిందని, అందువల్ల దాదాపు 2.6 బిలియన్ల మందిపై ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది. ఇది ఇలాగే కొనసాగితే వాయుకాలుష్యం పెరిగి.. ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని HEI అంచనా.
Next Story