నిమ్మగడ్డలో చంద్రబాబు చంద్రముఖిలా?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలకు దిగారు. నిమ్మగడ్డ శరీరంలోకి చంద్రబాబు చంద్రముఖిలా ప్రవేశించారని విజయసాయిరెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలకు దిగారు. నిమ్మగడ్డ శరీరంలోకి చంద్రబాబు చంద్రముఖిలా ప్రవేశించారని విజయసాయిరెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలకు దిగారు. నిమ్మగడ్డ శరీరంలోకి చంద్రబాబు చంద్రముఖిలా ప్రవేశించారని విజయసాయిరెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మ్యానిఫేస్టో ను విడుదల చేసిన చంద్రబాబు పై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. టీడీపీ గుర్తింపును ఎందుకు రద్దు చేయరని నిలదీశారు. మొదటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ధోరణి అలాగే ఉందన్నారు. చంద్రబాబుతో నిమ్మగడ్డ లాలూచీ ప్రతి లేఖలోనూ, ప్రతి నిర్ణయంలోనూ బయటపడుతుందన్నారు. నిమ్మగడ్డకు మతిభ్రమించిందన్నారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించాలని విజయసాయిరెడ్డి సూచించారు.