నేటి నుంచి నేను సాధారణ పౌరుడినే
తనకు రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. గవర్నర్, శాసన వ్యవస్థల పట్ల గౌరవం ఉందన్నారు. తాను ఈరోజు [more]
తనకు రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. గవర్నర్, శాసన వ్యవస్థల పట్ల గౌరవం ఉందన్నారు. తాను ఈరోజు [more]
తనకు రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. గవర్నర్, శాసన వ్యవస్థల పట్ల గౌరవం ఉందన్నారు. తాను ఈరోజు నుంచి సాధారణ పౌరుడినని తెలిపారు. విశేషాధికారాలను ఎన్నికల నిర్వహణ కోసమే వినియోగించానని చెప్పారు. ప్రభుత్వం సహకరించడం వల్లనే ఇది సాధ్యమయిందన్నారు. ఎన్నికలన్నీ సమర్థతతో సమన్వయంతో నిర్వహించానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం, ఎస్ఈసీ ల మధ్య వివాదం టీ కప్పులో తుపానులా ముగిసిందన్నారు. వ్యక్తుల అనాలోచిన నిర్ణయంతో వ్యవస్థ దెబ్బతింటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. తన పరిధిని దాటి ఎప్పుడూ వ్యవహరించలేదని, ఇతర వ్యవస్థల్లో జోక్యం చేసుకోలేదని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలను చేపట్టబోతున్న నీలం సాహ్నికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభినందనలు తెలిపారు.