ఆ తొమ్మిది మంది ఆచూకీ కోసం?
శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు 21 మంది సిబ్బంది లోపల ఉన్నారు. వారిలో 11 [more]
శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు 21 మంది సిబ్బంది లోపల ఉన్నారు. వారిలో 11 [more]
శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు 21 మంది సిబ్బంది లోపల ఉన్నారు. వారిలో 11 మంది బయటపడ్డారు. కొందరు గాయాలపాలు కాగా వారికి చికిత్సను అందిస్తున్నారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టెన్నళ్లలో నాలుగు పేలిపోయినట్లు అధికారులు గుర్తించారు. లోపలకి వెళ్లి సిబ్బందిని రక్షించడానికి కూడా వీలు లేకుండా పోయింది. దట్టమైన పొగ ఆవరించి ఉండటంతో ఫైర్ సిబ్బంది కూడా వెళ్లలేకపోతున్నారు. దీంతో ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రి జగదీశ్ రెడ్డి ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటన పట్ల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.