రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎలా ఉంటుందంటే?
ఐదు సూత్రాలతో ఆర్థిక ప్యాకేజీని రూపొందించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని మంత్రిత్వ శాఖలతో సంప్రందించిన తర్వాతనే ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీని రూపొందించినట్లు [more]
ఐదు సూత్రాలతో ఆర్థిక ప్యాకేజీని రూపొందించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని మంత్రిత్వ శాఖలతో సంప్రందించిన తర్వాతనే ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీని రూపొందించినట్లు [more]
ఐదు సూత్రాలతో ఆర్థిక ప్యాకేజీని రూపొందించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని మంత్రిత్వ శాఖలతో సంప్రందించిన తర్వాతనే ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీని రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఈ ప్యాకేజీ దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ఈ ప్యాకేజీని రూపొందిచామన్నారు. స్థానికంగా ఉత్పత్తులను రూపొందించడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఇప్పటికే గత కొద్ది రోజలుగా భారత్ పీపీఈలను సొంతంగా తయారు చేసిందని చెప్పారు. నలభై రోజుల్లో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు…
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మూడు లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వారి రుణాలకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందన్నారు. ఈ రుణాలకు నాలుగేళ్ల కాలపరిమితి, ఏడాది మారటోరియం ఉంటుందని చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఆరు రకాల చర్యలు చేపట్టినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అక్టోబరు వరకూ ఈ రుణ సదుపాయం లభిస్తుందని చెప్పారు. రెండు లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. నవ భారత నిర్మాణమే లక్ష్మమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఉత్పత్తులకు డిమాండ్ తీసుకురావడమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నగదు లభ్యతను పెంచడమే ప్రధాన ఉద్దేశ్యమని నిర్మలా సీతారామన్ వివరించారు.