వన్ నేషన్.. వన్ రేషన్.. రైతులకు కొంత ఊరట
దేశమంతా వన్ నేషన్ వన్ రేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిచారు. వలస కార్మికులకు రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలను ఇవ్వనున్నట్లు [more]
దేశమంతా వన్ నేషన్ వన్ రేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిచారు. వలస కార్మికులకు రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలను ఇవ్వనున్నట్లు [more]
దేశమంతా వన్ నేషన్ వన్ రేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిచారు. వలస కార్మికులకు రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలను ఇవ్వనున్నట్లు నిర్మల ప్రకటించారు. రేషన్ కార్డు లేని వారికి కూడా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు తెలిపారు. ఇందుకు రాష్ట్రాలు సహకరించాలని నిర్మల కోరారు. దీంతో దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. లబ్దిదారులకు సక్రమంగా అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. దీంతో పాటు వలస కార్మికులకు భోజనం, వసతి సౌకర్యాలను కల్పించేందుకు విపత్తుల నిర్వహణ నిధుల కింద 11 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. నరేగా పనుల ద్వారా వారికి వారి గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందన్నారు. మూడు కోట్ల మంది రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పారు. సకాలంలో రుణాలు చెల్లించే వారికి మే 31వ తేదీ వరకూ వడ్డీ రాయితీ ఉంటుందన్నారు. మార్చి 1 నుంచి మే 31 వరకూ రైతుల రుణాలపై వడ్డీ ఉండదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.