Tue Dec 24 2024 00:36:48 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పంటూ కథనాలు.. స్పందించిన యడియూరప్ప
కర్ణాటక ముఖ్యమంత్రి మరోసారి మార్చబోతున్నారని.. బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం బెంగళూరుకు..
బెంగళూరు : ఎవరైనా బీజేపీ టాప్ నేతలు కర్ణాటకకు వస్తుంటే చాలు... ముఖ్యమంత్రిని మార్చబోతున్నారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. గతంలో కూడా ఇలాంటి వదంతులే వచ్చాయి. తాజాగా కూడా అలాంటి కథనాలు మరోసారి ప్రసారం అయ్యాయి. కర్ణాటక ముఖ్యమంత్రి మరోసారి మార్చబోతున్నారని.. బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం బెంగళూరుకు రావడానికి కారణం ఇదేననే ప్రచారం సాగింది. ఆయన బెంగళూరుకు వచ్చాక స్థానిక నాయకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ విస్తృతంగా సాగింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వాన్ని కూల్చిన అనంతరం బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.
తన మార్కు చాణక్యంతో యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన ఎంతో కాలం కొనసాగలేదు.. బసవరాజు బొమ్మైని ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కొద్ది రోజులకే పదవి కోల్పోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి అటువంటిదే జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి మార్పు వార్తలపై యడియూరప్ప స్పందించారు. అలాంటి మార్పులేవీ ఉండబోవని స్పష్టం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మై బాగానే పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు.
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పంటూ కథనాలు.. స్పందించిన యడియూరప్పమంగళవారం నాడు కర్ణాటక రాష్ట్రంలో అమిత్ షా పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 'ఖేలో ఇండియా' యూనివర్సిటీ గేమ్స్ ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. బసవ జయంతి సందర్భంగా 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త, లింగాయత్ సన్యాసి బసవన్నకు నివాళులు అర్పిస్తారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమవుతారు.
Next Story