నామినేషన్లు స్వీకరణ నేడు.. జరిగే పనేనా?
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నేడు నామినేషన్లను స్వీకరించాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల కార్యక్రమం [more]
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నేడు నామినేషన్లను స్వీకరించాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల కార్యక్రమం [more]
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నేడు నామినేషన్లను స్వీకరించాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం పది గంటల నుంచి నామినేషన్లను స్వీకరించాలి. అయితే సుప్రీంకోర్టులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తీర్పు ఈరోజు మధ్యాహ్నం వెలువడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుందా? లేదా?అన్న ఉత్కంఠ నెలకొంది. అధికారులు ఎన్నికల కమిషన్ కు సహకరించకపోవడంతో నామినేషన్ల కార్యక్రమంపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు విపక్షాలు నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు.