రేవంత్ వంతు వచ్చింది
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వహణలో ఉన్న అధికారిని [more]
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వహణలో ఉన్న అధికారిని [more]
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వహణలో ఉన్న అధికారిని తోసేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతి భవన్ ముట్టడి సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.48లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.
పోలీసులను తోసేసి…..
రేవంత్ రెడ్డిని బయటకు రాకుండా కట్టడిచేశారు. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుచరులతో కలిసి అతివేగంగా ఇంట్లో నుంచి బయటకు దూసుకొ చ్చారు. ఆ సమయంలో అడ్డుకున్న ఎస్ఐ నవీన్ రెడ్డితో పాటు పలువురు పోలీసులను నెట్టుకుంటూ, పక్కకు తోసేస్తూ అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌పై ప్రగతి భవన్ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ నవీన్ రెడ్డి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేయగా ఆయనపై ఐపీసీ సెక్షన్ 341, 332తో పాటు 353 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.