Mon Dec 23 2024 11:26:54 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ ఓటీటీ : కొత్త హౌస్ అదిరింది.. రేపే ప్రారంభం
ప్రోమోలో నాగార్జున హౌస్‌లోకి వెళ్లి.. ఇప్పటివరకు టీవీలో బిగ్‌బాస్ గంటమాత్రమే చూశారు, ఇప్పుడు గ్యాప్ లేకుండా..
హైదరాబాద్ : బిగ్ బాస్ సందడి మొదలుకానుంది. ఇప్పటి వరకూ వచ్చిన ఐదు సీజన్లు రోజుకి గంట మాత్రమే ప్రసారమవ్వగా.. రేపట్నుంచి ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్ 6 ఓటీటీ 24 గంటలు ప్రసారం కానుంది. ఈ రియాలిటీ షో రేపే గ్రాండ్ ఓపెనింగ్ అవ్వనున్న నేపథ్యంలో మరో ప్రోమోను వదిలారు మేకర్స్. ఈ ప్రోమోతో నాగార్జునే హోస్ట్ అని చెప్పకనే చెప్పేశారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ ప్రోమోలో చూపించిన హౌస్.. సరికొత్త హంగులతో సిద్ధమైనట్లు కనిపిస్తోంది. గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ సిద్ధమవుతోంది.
ప్రోమోలో నాగార్జున హౌస్‌లోకి వెళ్లి.. ఇప్పటివరకు టీవీలో బిగ్‌బాస్ గంటమాత్రమే చూశారు, ఇప్పుడు గ్యాప్ లేకుండా హాట్‌స్టార్‌లో చూసేయండి అని చెప్పుకొచ్చారు. ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ కోసం ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తవగా ఇప్పటికే వీళ్ళే ఓటీటీ తొలి సీజన్ కంటెస్టెంట్లు అంటూ కొందరి పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో మాజీ కంటెస్టెంట్లు ఉండటం విశేషం. పాత కొత్త కంటెస్టెంట్ల కలయికలో ఈ ఓటీటీ తొలి సీజన్ ఎలా ఉంటుందో చూసేందుకు బిగ్ బాస్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ కంటెస్టంట్ల లిస్ట్ లో మాజీ కంటెస్టెంట్లు ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజలతో పాటు కొత్తగా.. యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో 'ఢీ-10' విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, 'సాఫ్ట్వేర్ డెవలపర్స్'వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు ఉన్నాయి. మరి వీరిలో ఎంతమంది హౌస్ లోకి వెళ్తారో.. కొత్తగా ఇంకెవరెవరు ఉన్నారో తెలియాలంటే రేపు సాయంత్రం వరకూ ఆగాల్సిందే.
Next Story