ఓటుకు నోటు కేసు... చంద్రబాబుకు షాక్
ఓటుకు నోటు కేసును సీబీఐ చేత విచారించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. రాజకీయ కక్షతో వేసిన ఈ కేసును విచరణకు తీసుకోవద్దని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ కోర్టును కోరారు. అయితే, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మల్యేకు డబ్బు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించినట్లు ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు వాయిస్ రికార్డును కూడా ఫోరెన్సీక్ ధృవీకరించిందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగ్గా విచారించడం లేదని, కాబట్టి సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోర్టును కోరారు. అయితే, ఎన్నికల కారణంగా ఈ కేసును విచారణకు స్వీకరించవద్దని చంద్రబాబు తరపు న్యాయవాది కోర్టును కోరగా, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు ఫిబ్రవరి నుంచి విచారిస్తామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను వైసీపీ ఎంపీ ఆళ్ల రామకష్ణారెడ్డి స్వాగతించారు.